Friday, January 14, 2011

sankranthi subhakankshalu

తెలుగు కుటుంబ సభ్యులందరికీ,
సంక్రాంతి శుభాకాంక్షలు... 
ఈ సంక్రాంతి మన అందరికీ ఎంతో సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అని ఆ దేవుడిని ప్రార్ధిస్తూ, 
ఈ సంవత్సరం అందరూ కోరుకున్న పనులు జరగాలి అని కోరుతూ, అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. 

ఐన వారందరికీ దూరంగా ఉంటూ, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, చిన్న నాటి సంగతులు తలచుకుంటూ,
ఎప్పటికన్నా ఆ జ్ఞాపకాలను అందుకుంటాం అని, ఆ సంగతులను తిరిగి రాస్తాం అని, అందరితో కలసి సరదాగా ఉంటాం అని,
ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో కోరికలతో మనం అందరం కలలు కంటాం, నమ్ముతాం. 
ఆ ఆశలు చెదిరిపోలేదు అని గుర్తు చేస్తూ, ఆ కోరికలు పదిలం అని వక్కాణిస్తూ, "మనకి మనం" అని తెలుగు వారం అంతా కలసి ఒకే కుటుంబం లా కలసి మెలసి ఉంటున్నాం, ఉంటాం, ఉందాం. 
ఇలాంటి సంక్రాంతి పండగలు అందరం కలిసి ఎన్నో జరుపు కోవాలి అని అనుకుంటూ, 
జీవితం లోని ఆనంద కెరటాలు అన్ని, మీ హృదయ తీరాన్ని తాకాలి అని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, 


తెలుగు పరివారం.

Monday, January 03, 2011

Mano Birthday (S/O Ananda Rao garu) - January 3, 2011

జనవరి 3, 2011
ఆనంద రావు గారి అబ్బాయి మనోహర్ పుట్టిన రాజు సందర్భంగా తెలుగు వారు అందరూ, ఆనంద రావు గారి ఇంట్లో కలవడం జరిగింది. పిల్లలు , పెద్దలు అందరూ సంతోషంగా 6 గంటల సేపు గడిపాము.
అప్పుడే న్యూ ఇయర్ జరుపుకున్న ఉత్సాహం తో అందరూ కుడా ఎంతో ఆనందం తో కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ, కాలం తెలియకుండా నవ్వుకున్నాం. కేకు కట్ చేసినప్పుడు, చేస్తున్నపుడు, చేసిన తరువాత కుడా ఆ నవ్వుల హోరు సాగింది.
కేకు కట్ చేసిన తరువాత ఘనంగా విందు. విందు అయ్యాక ఎవ్వరికీ కిందకి దిగే ఓపిక లేక కొంచెం సేపు కూర్చుని.. ఇంకొంచెం సేపు నవ్వుకుని అందరం ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్ళాము.

ఆ రోజు స్మృతుల ఆనవాళ్ళు కొన్ని... మన కోసం





new year

హలో
రువాండా తెలుగు ఫ్యామిలీ తరపు నుంచి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

తెలుగు వారు అందరం కలసి న్యూ ఇయర్ వేడుకల వైభవంగా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. గోపాల్ రెడ్డి గారు, ఆనంద రావు గారు, భానోజి రావు గారు, పూర్ణ చంద్ర రావు గారు, సుదీర్, విజయ్, ప్రకాష్, బైగ్ గారు, రామ రావు గారు, శ్రీనివాస్ గారు, జ్యోతి బసు గారు,  శ్రీధర్ గారు, వంశి, అజయ్, శ్రీనివాస రావు గారు, తదితరులు అందరూ కలిసి ఫామిలీస్ తో జాఫ్ఫ్రాన్ రెస్టారెంట్ లో డిసెంబర్ 31 రాత్రి 8 గంటలకు కలుసుకున్నాం. ఆటపాటలతో ఆ సాయంత్రం సందడి సందడి గా గడిచింది. సుదీర్, విజయ్, ఆనందరావు గారు, గోపాల్ రెడ్డి గారు, ప్రకాష్, కంచి శ్రీనివాస్ గారు వాతావరణాన్ని ఉత్తేజపరుస్తూ, జోకుల తో, డాన్సులతో, అందరినీ ఉత్సాహ పరుస్తూ, సాయంత్రాన్ని సరదాగా మార్చేసారు. అందరినీ డాన్సు కోసం ప్రోత్సాహిస్తూ, కొత్త సంవత్సరానికి తెర తీసారు.

బైగ్ గారి జోకులతో, సుదీర్ విజయ్ చమక్కులతో, ఆనంద రావు గారి డాన్సులతో, చిన్న పిల్లల కేరింతలతో గెంతులతో, ప్రకాష్ విసురులతో వాతావరణం తేలిక గా, సరదాగా గడిచిపోయింది.

అర్ధ రాత్రి 12 గంటలకి హోరెత్తిన హుషారు, మైమరచిన ఆనందాలతో, నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, ఒకరిని ఒకరు అభినందించుకుంటూ, ఒక మరపురాని అనుభూతి అందరం పంచుకున్నాం.

జనవరి 1 , తెల్లవార గానే పెద్దలు అందరూ కలిసి  చతుర్ ముఖ పారాయణం మొదలు పెట్టారు, లేడీస్ అందరూ కలిసి రజిని గారి ఇంట్లో కలుసుకున్నారు.