హలో
రువాండా తెలుగు ఫ్యామిలీ తరపు నుంచి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తెలుగు వారు అందరం కలసి న్యూ ఇయర్ వేడుకల వైభవంగా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. గోపాల్ రెడ్డి గారు, ఆనంద రావు గారు, భానోజి రావు గారు, పూర్ణ చంద్ర రావు గారు, సుదీర్, విజయ్, ప్రకాష్, బైగ్ గారు, రామ రావు గారు, శ్రీనివాస్ గారు, జ్యోతి బసు గారు, శ్రీధర్ గారు, వంశి, అజయ్, శ్రీనివాస రావు గారు, తదితరులు అందరూ కలిసి ఫామిలీస్ తో జాఫ్ఫ్రాన్ రెస్టారెంట్ లో డిసెంబర్ 31 రాత్రి 8 గంటలకు కలుసుకున్నాం. ఆటపాటలతో ఆ సాయంత్రం సందడి సందడి గా గడిచింది. సుదీర్, విజయ్, ఆనందరావు గారు, గోపాల్ రెడ్డి గారు, ప్రకాష్, కంచి శ్రీనివాస్ గారు వాతావరణాన్ని ఉత్తేజపరుస్తూ, జోకుల తో, డాన్సులతో, అందరినీ ఉత్సాహ పరుస్తూ, సాయంత్రాన్ని సరదాగా మార్చేసారు. అందరినీ డాన్సు కోసం ప్రోత్సాహిస్తూ, కొత్త సంవత్సరానికి తెర తీసారు.
బైగ్ గారి జోకులతో, సుదీర్ విజయ్ చమక్కులతో, ఆనంద రావు గారి డాన్సులతో, చిన్న పిల్లల కేరింతలతో గెంతులతో, ప్రకాష్ విసురులతో వాతావరణం తేలిక గా, సరదాగా గడిచిపోయింది.
అర్ధ రాత్రి 12 గంటలకి హోరెత్తిన హుషారు, మైమరచిన ఆనందాలతో, నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, ఒకరిని ఒకరు అభినందించుకుంటూ, ఒక మరపురాని అనుభూతి అందరం పంచుకున్నాం.
జనవరి 1 , తెల్లవార గానే పెద్దలు అందరూ కలిసి చతుర్ ముఖ పారాయణం మొదలు పెట్టారు, లేడీస్ అందరూ కలిసి రజిని గారి ఇంట్లో కలుసుకున్నారు.
Hello Telugu Family,
ReplyDeleteHappy New Year to you all.
Hope every one has done big DHAMAKA as I found every one dancing jubilantly.
We missed you all and the occassion. We also enjoyed in the same way with my family reunion in Houston, USA. Will post the pictures shortly.
Wish you all once again a very Happy New Year and Happy Sankranti.
Raghu Rama Rao Family